Hyderabad, జూన్ 3 -- నెట్ఫ్లిక్స్లో రెండేళ్ల కిందట వచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు. వెంకటేశ్, రానాలాంటి తెలుగు హీరోలు నటించిన ఈ సిరీస్ దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. బూతు డైలాగులు, మితిమీరిన శృంగార సీన్లతో షాక్కు గురి చేసింది. నిజ జీవితంలో బాబాయ్ అబ్బాయ్ అయిన వెంకీ, రానా తండ్రీకొడుకులుగా నటించిన ఈ రానా నాయుడు సీజన్ 2 ట్రైలర్ మంగళవారం (జూన్ 3) రిలీజైంది.
రానా నాయుడు సీజన్ 2 జూన్ 13 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. తొలి సీజన్ కు మించి యాక్షన్ తో ఈ కొత్త సీజన్ రానున్నట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. ఇందులోనూ తండ్రీకొడుకులైన నాగా నాయుడు, రానా నాయుడు ముఖాముఖి తలపడబోతున్నారు. ఈ సీజన్ కూడా ఫుల్ యాక్షన్ ఉండబోతున్నట్లు ట్రైలర్ తోనే మేకర్స్ చెప్పారు.
కరణ్ అన్షుమన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.