భారతదేశం, జూన్ 6 -- Feng Shui Dining Table Tips : మన నిత్య జీవితంలో ఉపయోగించే ప్రతి చిన్న వస్తువుకు, అది ఉండే స్థానానికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుందని ఫెంగ్ షుయ్ శాస్త్రం నమ్ముతుంది. ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనం చేసే పనులు, ఇంట్లో వస్తువులను సర్దే విధానం మన ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా ఇంట్లోని భోజన ప్రాంతం (డైనింగ్ ఏరియా) విషయానికి వస్తే కొన్ని ప్రత్యేక నియమాలను పాటించడం తప్పనిసరి.

ఫెంగ్ షుయ్ నియమాల ప్రకారం... డైనింగ్ టేబుల్ అనేది కేవలం కూర్చుని ఆహారం తినే స్థలం మాత్రమే కాదు. అది ఆ ఇల్లాలు, ఆ కుటుంబం యొక్క సంతోషాన్ని, ఐశ్వర్యాన్ని, శ్రేయస్సును ప్రతిబింబించే ఒక పవిత్రమైన స్థానం. అందుకే రాత్రి పడుకునే ముందు కేవలం వంటగదిని మాత్రమే కాకుండా, డైనింగ్ టేబుల్‌ను కూడా పూర్తిగా శుభ్రం చేసుకోవడ...