భారతదేశం, మార్చి 12 -- వ్యవసాయ బావులు, కాల్వలకు అమర్చిన కరెంట్ మోటార్లను దొంగిలిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను వరంగల్ సీసీఎస్ పోలీసులు కమలాపూర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో 7 మంది నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.6,60,000 విలువ గల 71 కరెంట్ మోటార్లు, దొంగతనాలకు ఉపయోగించిన ఒక ఆటో ట్రాలీ, ఒక కారు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు మద్యానికి అలవాటు పడి జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించేందుకు వ్యవసాయ బావులు, కాల్వలకు అమర్చిన కరెంట్ మోటార్లను దొంగిలించి అమ్ముకుంటూ వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు గతంలో కూడా కరీంనగర్, రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించిన కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినట్...