భారతదేశం, డిసెంబర్ 22 -- టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' (Varanasi) ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా కోసం మహేశ్ బాబు చేస్తున్న కష్టం, చూపిస్తున్న అంకితభావం చూస్తుంటే జక్కన్న మరో అద్భుతాన్ని వెండితెరపై ఆవిష్కరించబోతున్నారని టాక్ నడుస్తోంది.

ముఖ్యంగా వారణాసి చిత్రంలో 'రుద్ర' అనే శక్తివంతమైన పాత్ర కోసం మహేశ్ బాబు కేరళకు చెందిన పురాతన యుద్ధ కళ 'కలరిపయట్టు' (Kalaripayattu) లో ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన ప్రసిద్ధ కలరిపయట్టు నిపుణుడు హరి కృష్ణన్ తాజాగా మహేష్ బాబుతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ తన అనుభవాన్ని వివరించారు.

"భారతీయ సినిమా గ్లోబల్ స్టార్‌కు కలరిపయట్టులో శిక్షణ ఇస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు. మహేశ్ బాబు గా...