భారతదేశం, ఆగస్టు 27 -- ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పరిధిలోని రాజమహేంద్రవరం 4వ (IR) బెటాలియన్, APSPలో ఖాళీగా ఉన్న వివిధ రకాల అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్, 4వ బెటాలియన్ కమాండెంట్ పి. సత్తిబాబు ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.

మొత్తంగా వివిధ విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు నెలకు రూ. 15,000 వేతనంగా చెల్లిస్తారు. రికార్డు అసిస్టెంట్ (Record Assistant)01, ఆఫీస్ సబోర్డినేట్ 1, స్వీపర్లు 9, దోబీలు 5, బార్బర్లు 4, కుక్స్ 14, స్కావెంజర్స్ 03 పోస్టులు ఉన్నాయి.

పోస్టును బట్టి విద్యార్హతలు ఉంటాయి. 7వ తరగతి చదవడం, రాయడం, సంబంధిత వృత్తి నైపుణ్యం ఉండాలి. 01...