భారతదేశం, అక్టోబర్ 1 -- రాజమహేంద్రవరం నుండి తిరుపతికి కనెక్ట్ అయ్యే.. కొత్త విమాన సర్వీసును పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇది ఉమ్మడి గోదావరి జిల్లాల వాసులకు ప్రయాణ అవకాశాలను మెరుగుపరుస్తోంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్ నుండి ఎంపీ పురందేశ్వరితో కలిసి మంత్రి రామ్మోహన్ నాయుడు వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బుచ్చయ్య చౌదరి హాజరయ్యారు.

అలయన్స్ ఎయిర్ ద్వారా నిర్వహిస్తున్న ఈ సర్వీసు 2వ తేదీ నుండి షెడ్యూల్ ప్రకారం ప్రయాణిస్తుంది. ప్రతి మంగళ, గురువారం, శనివారాల్లో రాజమహేంద్రవరం నుంచి తిరుపతికి విమానాలు అందుబాటులో ఉంటాయి. టికెట్ ధర మెుదటి 35 సీట్లకు రూ.1999, తర్వాత 35 సీట్లకు రూ.4000 మూడు నెలలపాటు అ...