భారతదేశం, ఫిబ్రవరి 24 -- రాజమహేంద్రవరం కల్తీ ఘటనపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే ఈ ఘటనలో ఐదుగురు చనిపోయారు. ఆక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ ఘటన నేపథ్యంలో కోరుకొండ మండలం నరసాపురం గ్రామాన్ని ఆరోగ్య శాఖ కమిషనర్ జి.వీర పాండ్యన్, జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, డీఐజీ అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్, ఇతర వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు.
ఈ సందర్భంగా గ్రామంలో సమగ్రంగా ఫ్యాక్ట్ ఫైండింగ్ ప్రక్రియను మరోసారి సమీక్షించారు. తాగునీరు, పాలు, ఇతర ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు అధికారులు తెలిపారు. ప్రజల్లో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉందని కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఆరోగ్య శాఖ బృందాలు ఇంటింటా సర్వే నిర్వహిస్తూ, లక్షణాలు గమనించిన వెంటనే వైద్య సేవలు అందించేలా చర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.