భారతదేశం, ఆగస్టు 7 -- మద్యం మత్తు, క్షణికావేశం రెండు కుటుంబాల్లో కోలుకోలేని విషాదాన్ని నింపాయి. కాబోయే భర్తతో కొత్త జీవితాన్ని ప్రారంభించాల్సిన ఒక యువ వైద్యురాలు, ఇద్దరు పోకిరీల ఉన్మాదానికి బలవుతూ ప్రస్తుతం ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతోంది. రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న ఈ ఘోర ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సష్టించింది.

సోమవారం రాత్రి ఈ దారుణం జరగ్గా.. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు రావడంతో గురువారం నాడు విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ప్రియాంక అనే యువతి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఒక ప్రైవేట్ వైద్య కళాశాలలో డెర్మటాలజీ విభాగాలో పీజీ (వైద్య విద్య) అభ్యసిస్తోంది. సోమవారం రాత్రి ఆమె తన సహచర విద్యార్థినితో కలిసి రాజమహేంద్రవరంలోని ఏ.వి. అప్పారావు రోడ్డులో ఉన్న ఐనాక్స్ థి...