భారతదేశం, ఆగస్టు 13 -- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి, ఆర్థిక పురోగతికి అమరావతి రాజధాని నగర నిర్మాణమే తొలి విజయ సోపానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీడ్ యాక్సెస్ రహదారి ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. అంతకుముందు సీడ్ యాక్సెస్ రోడ్డును అనుసంధానించే స్టీల్ బ్రిడ్జీల ప్రారంభానికి సూచికగా ఉండవల్లి వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. విభజన గాయాల నుంచి కోలుకుని, భూములిచ్చిన రైతుల త్యాగాల పునాదులపై నిర్మితమవుతున్న అమరావతి ఇకపై ఏ శక్తుల వల్లా ఆగదని, ప్రపంచ అత్యుత్తమ నగరాల సరసన నిలుస్తుందని అన్నారు.

సీడ్ యాక్సెస్ రోడ్డుతో రాజధాని నిర్మాణానికి కీలక మలుపు జరుగుతుందన్నారు. మూడో దశలో తాడేపల్లి వద్ద జాతీయ రహదారితో అనుసంధానం అవుతుందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ వ్...