భారతదేశం, నవంబర్ 16 -- వంగవీటి కుటుంబం నుంచి మరో వ్యక్తి రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. వంగవీటి రంగా కుమార్తె ఆశా కిరణ్ రాజకీయాలపై స్పష్టమైన ఆసక్తిని కనబరిచారు. విజయవాడలోని రంగా విగ్రహానికి నివాళులు అర్పించిన తర్వాత ఆమె తన రాబోయే రాజకీయ ప్రవేశం గురించి చెప్పారు.

తాను ఇప్పుడు అధికారిక ప్రకటన చేయడం లేదని, తర్వాత ప్రకటిస్తానని ఆశా కిరణ్ మీడియాకు చెప్పారు. రంగా ఆదర్శాలను అనుసరించాలని, ప్రజలకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. దాదాపు దశాబ్దం పాటు ప్రజా జీవితానికి దూరంగా ఉన్న తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి అడుగు పెట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తున్నారు.

తన సోదరుడు వంగవీటి రాధాతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, ఆయన మద్దతు తనకు ఉందని తాను నమ్ముతున్నానని ఆశా అన్నారు. వేర్వేరు రాజకీయ నిర్ణయాలు తీసుకోవచ్చు, కానీ అద...