భారతదేశం, అక్టోబర్ 1 -- ఉత్తరాంధ్ర జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలు జారీ అయ్యాయి. రాగల 3 గంటల్లో శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి, అనకాపల్లి జిల్లాల్లో కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

ఇక విజయనగరం,విశాఖపట్నం జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సూచనలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని. చెట్ల కింద నిలబడరాదని సూచించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది.

మరోవైపు గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద 48.1అడుగుల నీటి మట్టం ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 12,38,852 క్యూసెక్కులుగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇక కృష్ణాలో వర...