Telangana,hyderabad, ఆగస్టు 9 -- రాఖీ పండగ వేళ రాష్ట్రంలోని అన్ని బస్సు డిపోల్లో ప్రయాణికుల రద్దీ నెలకొంది.దీనికితోడు వరుసగా సెలవు దినాలు ఉండటంతో. రాకపోకలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ప్రయాణికుల రద్దీ వేళ తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వీటిల్లో అదనపు ఛార్జీలను వసూళ్లు చేస్తున్నట్లు తాజా ప్రకటన విడుదల చేసింది.

రాఖీ పౌర్ణమి పర్వదిన సందర్భంగా ప్రయాణికులకు రవాణాపరమైన అసౌకర్యం కలుగకుండా TGSRTC ఏర్పాట్లు చేసింది. ప్రతి ఏడాది మాదిరిగానే ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచింది. రాష్ట్ర ప్రభుత్వ జీవో ప్ర‌కారం రాఖీ పండుగకు నడిచే స్పెష‌ల్ బ‌స్సుల్లో టికెట్ ధరలను సంస్థ సవరించింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే 1.50 వ‌ర‌కు టికెట్ ధ‌ర‌ల‌ను స‌వ‌రించింది.

స్పెష‌ల్ బ‌స్సులు మిన‌హా రెగ్యూల‌ర్ బ‌స్సుల్లో సాధార‌ణ చార్జీలే ...