భారతదేశం, నవంబర్ 2 -- బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ జోరుగా సాగుతోంది. ఇప్పటికీ బిగ్ బాస్ నుంచి ఈ వారం దివ్వెల మాధురి లీక్ అయిన విషయం తెలిసిపోయింది. ఇక ప్రతి వీకెండ్ కంటెస్టెంట్లపై రివ్యూ చేసే హోస్ట్ నాగార్జున వచ్చేశారు. శనివారం నాటి ఎపిసోడ్‌లో సీరియస్ వార్నింగ్‌లు ఇచ్చిన నాగార్జున ఆదివారం సరదా టాస్క్‌లు నిర్వహించనున్నార.

అలాగే, బిగ్ బాస్ తెలుగు 9 నవంబర్ 2 తేది ఎపిసోడ్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గెస్ట్‌గా హాజరైంది. దీనికి సంబంధించిన నేటి బిగ్ బాస్ ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఇవాళ ప్రసారమయ్యే బిగ్ బాస్ తెలుగు 9 ఎపిసోడ్‌లో స్టైలిష్ డ్రెస్సులో నాగార్జున కనిపించాడు.

"కింగ్ ఈజ్ బ్యాక్" అని సంజన గల్రాని అంది. "అంటే ఇప్పటిదాకా బ్యాక్ లేదా" అని నాగార్జున పంచ్ వేస్తే.. "నిన్న పోయి ఇవాళ బ్యాక్ సర్" అని సంజన బదులిచ్చింది. దానికి అంతా నవ్వేశారు. త...