భారతదేశం, నవంబర్ 4 -- ఏకాదశి గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తిని పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందడానికి వీలవుతుంది. త్వరలోనే రమా ఏకాదశి రాబోతుంది. ఆ రోజు విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో ఆరాధించి ఉపవాసం ఉంటే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. అలాగే రమా ఏకాదశి నాడు ఈ పనులు చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది.

హిందూ మతంలో రమా ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవిని కూడా పూజించొచ్చు. రమా ఏకాదశి వ్రతాన్ని నవంబర్ ఐదు, గురువారం నాడు ఆచరించనున్నారు. ఆ రోజు తులసి పరిహారాలను కూడా చేయండి. అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. విష్ణుమూర్తి అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

రమా ఏకాదశి నాడు తులసి మొక్క చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే విష్ణుమూర్తి అనుగ...