భారతదేశం, ఆగస్టు 20 -- అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లను (RTIH) ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 ఇతర కేంద్రాలను కూడా ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి టాటా గ్రూప్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ కూడా హాజరయ్యారు.

టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా పేరు మీదుగా ఏర్పాటు చేసిన ఈ హబ్‌లు, ఆవిష్కరణలను, వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, స్టార్టప్‌లకు మార్గదర్శకత్వం వహించడం వంటివి చేస్తాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. "రతన్ టాటా ఆలోచనలను సజీవంగా ఉంచడానికి మేం ఏదైనా చేయాలనుకున్నాం. ఆ ఆలోచన నుంచే ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ వచ్చింది" అని అన్నారు.

చంద్రశేఖరన్‌తో తాను ఫోన్‌లో ఈ ఆలోచనను పంచుకున్నప్పుడు ఆయన అంగీకరించారని నాయుడు తెలిపారు. "ఈ దేశానికి ఆయన చేసిన గొప్ప సేవలక...