భారతదేశం, జనవరి 3 -- రజనీకాంత్, కమల్ హాసన్ కాంబినేషన్ ను మళ్లీ చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే తలైవర్ 173 సినిమాతో అది నిజం కానుంది. అయితే ఈ మూవీకి కమల్ హాసన్ ప్రొడ్యూసర్. రజనీకాంత్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ ను ఇవాళ (జనవరి 3) అనౌన్స్ చేశారు. ఎవరూ ఊహించని విధంగా యంగ్ డైరెక్టర్ సిబి చక్రవర్తికి బంపరాఫర్ దక్కింది.

రజనీకాంత్ హీరోగా కమల్ హాసన్ కు చెందిన రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ ఓ మూవీ తెరకెక్కించనుంది. మొదట దీనికి సుందర్.సి డైరెక్టర్ గా అనుకున్నారు. కానీ ఆయన తప్పుకొన్నాడు. ఇప్పుడు సస్పెన్స్ కు తెరదించుతూ కొత్త డైరెక్టర్ గా యువ దర్శకుడు సిబి చక్రవర్తి పేరును ప్రకటించారు. 'తలైవర్ 173' అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం పొంగల్ 2027 కోసం ప్రేక్షకుల ముందుకు రానుంది.

తలైవర్ 173 సినిమాను ...