భారతదేశం, మార్చి 13 -- ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే 'ఈద్ ఉల్-ఫితర్' (రంజాన్) పండుగ రానే వచ్చింది. నెల రోజుల కఠిన ఉపవాస దీక్షల తర్వాత ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ పండుగ తేదీపై సహజంగానే ప్రతి ఏడాదీ ప్రపంచవ్యాప్తంగా కొంత గందరగోళం నెలకొంటుంది. ఇస్లామిక్ హిజ్రీ క్యాలెండర్‌లోని పదో నెల 'షవ్వాల్' మొదటి రోజున ఈ పండుగను జరుపుకుంటారు. అయితే, భౌగోళిక పరిస్థితులు, కాలమాన వ్యత్యాసాల వల్ల వేర్వేరు దేశాల్లో వేర్వేరు రోజుల్లో నెలవంక కనిపిస్తుంది.

రంజాన్ మాసం ముగింపును, ఈద్ ఉల్-ఫితర్ రాకను నిర్ణయించేది నెలవంక దర్శనమే (Moon Sighting). పండుగ తేదీలపై ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు యూఏఈకి చెందిన అల్ ఖాతిమ్ ఆస్ట్రనామికల్ అబ్జర్వేటరీ, షవ్వాల్ నెలవంక దర్శనానికి సంబంధించిన రెండు చిత్రాలను తాజాగా విడుదల చేసింది. నెలవంక కనిపించే తేదీ ఆధారంగా మూన్ సైటింగ్ కమిట...