భారతదేశం, జూన్ 17 -- జూన్ 21న వైజాగ్‌లో జరిగే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. దీంతో ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు గవర్నర్ కార్యాలయం నుంచి కూడా ఓ ప్రకటన వెలువడింది. రాష్ట్ర ప్రజలు చురుగ్గా పాల్గొనాలని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ కోరారు. యోగా భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన బహుమతి అని అభివర్ణించిన గవర్నర్ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.

జూన్ 21న జరిగే యోగా దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ విజ్ఞప్తి చేసినట్లు రాజ్ భవన్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. విశాఖపట్నంలో జరిగే ఈ కార్యక్రమంలో చాలా మంది ప్రజలు పాల్గొంటారని అంచనా.

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించడ...