భారతదేశం, సెప్టెంబర్ 15 -- యూరియా వాడకంపై చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరం నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సహాకాలు ఉంటాయని ప్రకటించారు. కలెక్టర్ల సదస్సు సందర్భంగా వ్యవసాయరంగంపై చర్చిస్తూ.. రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై అధికారులతో సీఎం మాట్లాడారు. యూరియా అతిగా వాడితే ప్రజారోగ్యం దెబ్బతింటుందని చంద్రబాబు చెప్పారు. అందకోసమే దాని వాడకం తగ్గించాలన్నారు.

యూరియా వాడకం తగ్గించే ప్రతీ కట్టకు రూ.800 నేరుగా రైతులకు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు. రైతులు నష్టపోకూడదు, ప్రజల ఆరోగ్యం కూడా బాగుండాలని చెప్పారు. యూరియా ఎక్కువగా వాడితే క్యాన్సర్ వస్తుందన్నారు. అందుకే వాడకంపై రైతుల్లో అవగాహన తేవాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ టాప్ 5 జాబితాలో ఉందన్న సీఎం.. ఇలానే వాడుతూ పోతే నెంబర్ 1లోకి వెళ్తామని హెచ్చరించారు. ఏదైనా ఎంత వర...