భారతదేశం, అక్టోబర్ 1 -- తెలంగాణలో ఉన్న 13 ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీ ప్రక్రియ ఎట్టకేలకు ముందుకు కదిలింది. ఈ నియామకాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కాకుండా జీఓ 21 ప్రాతిపదికన వర్సిటీ స్థాయిలోనే భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది.

వర్సిటీ నియామకాలపై ఏర్పడిన ప్రతిష్టంభనకు తెరదించేందుకు సీఎం కార్యాలయ ముఖ్యకార్యదర్శి ఎన్. శ్రీధర్ సమక్షంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. విద్యాశాఖ ఉన్నతాధికారులు, ముగ్గురు వర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఈ భేటీలో పాల్గొన్నారు.

గతంలో జారీ చేసిన జీఓ 21 విధానంలో కొన్ని సవరణలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. యూజీసీ మార్గదర్శకాలకు భిన్నంగా జీఓ 21లో పీహెచ్‌డీ అభ్యర్థులకు ఇచ్చే వెయిటేజీ మార్కులను తగ్గించారనే విమర్శలు ర...