భారతదేశం, జూలై 17 -- కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 భారతదేశంలో లాంచ్ అయింది. దీని ధర రూ.2.40 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఇది గొప్ప ఫీచర్లు, బలమైన పనితీరును కలిగి ఉంటుంది.

టీవీఎస్ మోటార్ కంపెనీ కొత్త అపాచీ ఆర్టీఆర్ 310ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ శక్తివంతమైన స్పోర్ట్స్ బైక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను 2.40 లక్షలు ఎక్స్ షోరూమ్ ధరగా ఉంచారు. ఈ బైక్ కేవలం లుక్ పరంగానే కాకుండా పనితీరు, టెక్నాలజీ పరంగా కూడా తన సెగ్మెంట్‌లో అత్యంత ప్రత్యేకమైన బైక్‌గా నిలిచింది. అపాచీ ఆర్టీఆర్ 310 ప్రత్యేకతలు తెలుసుకుందాం..

బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.2,39,990, టాప్ వేరియంట్ ప్రారంభ ధర రూ.2,57,000గాఉంటుంది. వేరియంట్ ఆధారంగా ధరలో మార్పులు ఉంటాయి.

ఇందులోని 312సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ 35.6 బీహెచ్‌పీ పవర్, 28.7ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో డ్రాగ్ టార్క్...