భారతదేశం, అక్టోబర్ 29 -- వాషింగ్టన్: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ (ఫెడ్) కీలక నిర్ణయం తీసుకుంది. బెంచ్‌మార్క్ ఫెడరల్ ఫండ్స్ రేటును 3.75 శాతం నుంచి 4 శాతం పరిధిలోనే స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని స్పష్టం చేసినప్పటికీ, రాబోయే డిసెంబర్ విధాన సమీక్ష సమావేశంలో రేట్లను పెంచుతామా లేదా అనే అంశంపై ఫెడ్ స్పష్టమైన సూచన ఏదీ ఇవ్వలేదు.

"ద్రవ్యోల్బణాన్ని 2 శాతానికి తీసుకురావడానికి తగిన విధాన నిర్ణయం తీసుకోవడంలో మరింత సమాచార సేకరణ దోహదపడుతుంది. ధరల స్థిరత్వాన్ని ఫెడరల్ రిజర్వ్ సాధిస్తుంది" అని సమావేశం అనంతరం పాలసీ ప్రకటనలో విధాన నిర్ణేతలు తెలిపారు.

ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్‌ఓఎంసీ) నిర్వహించిన ఓటింగ్‌లో వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచేందుకు 10-2 మెజారిటీతో నిర్ణయం ఆమోదంపొందింది....