భారతదేశం, జూలై 17 -- అమెరికాలోని అలాస్కా తీరంలో భారీగా భూకంపం వచ్చింది. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ అంటే ఎన్సీఎస్ ఈ హెచ్చరిక జారీ చేసింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.37 గంటలకు భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. శాండ్ పాయింట్ పట్టణానికి దక్షిణంగా 87 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.

అలాస్కాలోని పామర్‌లోని నేషనల్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ నిర్ధారణ అయిందని, కొంత ప్రభావం ఉండొచ్చని తెలిపింది. 1964 మార్చిలో అలాస్కాలో ఎన్నడూ లేనంత బలమైన భూకంపం నమోదైంది. భూకంప తీవ్రత 9.3గా నమోదైంది. సునామీ, భూకంపం కారణంగా 250 మందికి పైగా మరణించారు. 2023 జూలైలో అలాస్కాలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే కొన్ని ప్రకంపనలు తప్ప పెద్దగా నష్టం జరగలేదు.

ఇప్పుడు తాజాగా 7.3 తీవ...