భారతదేశం, సెప్టెంబర్ 23 -- ఈ మధ్యకాలంలో యువ భారతీయుల్లో గుండెపోటు సంఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గతంలో మధ్యవయసు వారికి, వృద్ధులకు మాత్రమే పరిమితమైన ఈ సమస్య ఇప్పుడు ఇరవైలు, ముప్పైల వయసు వారిని కూడా వణికిస్తోంది. దీనికి కొన్ని జీవనశైలి అలవాట్లు తోడై ప్రాణాంతక పరిస్థితులకు దారి తీస్తున్నాయి. చెన్నైలోని ఎంజీఎం హెల్త్‌కేర్ హాస్పిటల్ సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ బాబు ఎఝుమలై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఇష్టమొచ్చినప్పుడు తినే అలవాట్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని నేరుగా పెంచుతున్నాయని స్పష్టం చేశారు.

అతి ముఖ్యంగా, గుండె జబ్బులు లేని వారికి సైతం గుండెపోటు రావడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆయన తెలిపారు. చాలా మంది షాక్ అయ్యే విషయం ఏంటంటే, అవి చాలా సాధారణమైనవి. "అల్పాహారం మానేయడం (Skipping breakfast), రాత్రి ఆలస్యంగా తినడం (...