భారతదేశం, అక్టోబర్ 23 -- ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ప్రియులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. యాపిల్ తన తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 'ఐఫోన్ డ్యూయో'ను మార్కెట్లోకి విడుదల చేసింది. 2017లో వచ్చిన 'ఐఫోన్ X' తరహాలోనే ఇది కూడా యాపిల్ చరిత్రలోనే ఒక అత్యంత సాహసోపేతమైన మోడల్‌గా నిలుస్తుంది. పాస్‌పోర్ట్ స్టైల్ డిజైన్‌తో వచ్చిన ఈ ప్రీమియం డివైజ్ డిజైన్, కెమెరా, పెర్ఫార్మెన్స్, ఇతర విశేషాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

ఐఫోన్ డ్యూయోను చేతిలోకి తీసుకోగానే దాని వినూత్న రూపం దృష్టిని ఆకర్షిస్తుంది. సాధారణ స్మార్ట్‌ఫోన్ల కంటే పొడవు కాస్త తక్కువగా ఉండే పాస్‌పోర్ట్ శైలి డిజైన్‌ను యాపిల్ ఎంచుకుంది. టైటానియం ఫ్రేమ్, ముందు, వెనుక భాగాల్లో సెరామిక్ షీల్డ్‌తో ఈ ఫోన్‌ను అత్యంత విలాసవంతంగా తీర్చిదిద్దారు.

యాపిల్ ఇంజినీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా దీని హింజ్ (Hin...