భారతదేశం, జూన్ 26 -- ప్రతి ఏటా మ్యూచువల్ ఫండ్స్ రేటింగ్‌లు, రిటర్న్స్ టేబుల్స్ విడుదల కాగానే పెట్టుబడిదారులలో ఒక రకమైన ఆశ పుడుతుంది. ఏదైనా స్మాల్-క్యాప్ ఫండ్ 30 నుంచి 40 శాతం లాభాలు ఇచ్చిందనో, లేదా ఒక థీమాటిక్ ఫండ్ ఇన్వెస్టర్ల డబ్బును రెట్టింపు చేసిందనో వినగానే.. మన డబ్బును కూడా ఆ ఫండ్స్‌లోకి మార్చాలనే ఆలోచన వస్తుంది. కానీ, ఇలా కేవలం గతాన్ని చూసి నిర్ణయాలు తీసుకోవడం అస్సలు మంచిది కాదని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

"నిన్నటి విజేతలు రేపు కూడా విజేతలుగా నిలుస్తారని నమ్మడం మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులలో అతిపెద్ద పొరపాటు" అని ది వెల్త్ కంపెనీ మ్యూచువల్ ఫండ్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ దేబాశిష్ మొహంతీ పేర్కొన్నారు.

కేవలం ఒక ఏడాది రిటర్న్స్ చూసి నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రమాదాలు ఉన్నాయి. ఎందుకంటే అవి గడిచిన కాలానికి సంబంధించిన సమాచారాన్ని మ...