భారతదేశం, జూలై 14 -- మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) లింక్డ్‌ఇన్ లెర్నింగ్ (LinkedIn Learning)తో చేతులు కలిపింది. ఈ భాగస్వామ్యం ద్వారా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు తమ అకడమిక్ విద్యతో పాటు పరిశ్రమలకు అవసరమైన అత్యాధునిక సాంకేతిక నైపుణ్యాలను సొంతం చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతర్జాతీయ స్థాయిలో మారుతున్న ఉద్యోగ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడమే ఈ ఉమ్మడి చొరవ వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం.

లింక్డ్‌ఇన్ లెర్నింగ్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, బిజినెస్ అనలిటిక్స్ వంటి విభిన్న రంగాలకు చెందిన కోర్సులను విద్యార్థులు అభ్యసించవచ్చు.

పరిశ్రమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం వేగంగా పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జన...