మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ లాభాల జోరు: Q1లో రూ.300 కోట్లకు పైగా టర్నోవర్
భారతదేశం, జూలై 27 -- రిజిడ్ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ రంగానికి చెందిన హైదరాబాద్ దిగ్గజ సంస్థ 'మోల్డ్-టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్' (MTPL) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో సత్తా చాటింది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి (Q1) గాను రూ.25.57 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే సమయానికి నమోదైన రూ.22.40 కోట్లతో పోలిస్తే ఇది 14.17 శాతం పెరుగుదల.
కంపెనీ మొత్తం రెవెన్యూ ఏటికేడాది 24.90% పెరిగి రూ.300.45 కోట్లకు చేరుకుంది. గతేడాది జూన్ త్రైమాసికంలో ఈ ఆదాయం రూ.240.56 కోట్లుగా ఉండేది. దీంతో కంపెనీ త్రైమాసిక టర్నోవర్ తొలిసారిగా రూ.300 కోట్ల దాటి కొత్త మైలురాయిని అందుకుంది.
కంపెనీ నిర్వహణ సామర్థ్యం పెరగడం, హైదరాబాద్‌లోని యూనిట్ల ఏకీకరణ, అలాగే అధిక లాభాలు ఇచ్చే ఫార్మా ప్యాకేజింగ్ బిజినెస్ పుంజుకోవడంతో మోల్డ్-టెక్ మునుపెన్నడూ లేని స్థాయి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.