భారతదేశం, నవంబర్ 4 -- హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రముఖ ఇంజనీరింగ్ సేవల సంస్థ మోల్డ్-టెక్ టెక్నాలజీస్ లిమిటెడ్ (Mold-Tek Technologies Limited) 2026-27 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (Q2 FY 2026-27) ఊహించని రీతిలో ఆల్‌టైమ్ రికార్డు ఫలితాలను ప్రకటించింది. త్రైమాసిక నికర లాభం మరే త్రైమాసికంలోనూ లేని రీతిలో భారీగా పుంజుకుని కంపెనీ చరిత్రలోనే అత్యుత్తమ స్థాయిని తాకింది.

కంపెనీ వెల్లడించిన కన్సాలిడేటెడ్ ఆర్థిక నివేదికల ప్రకారం, క్యూ2లో మొత్తం ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 51.2 శాతం పెరిగి రూ.60.81 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయంలో లభించిన ఆదాయంతో పోలిస్తే ఇది అత్యంత బలమైన వృద్ధి. మరోవైపు, కంపెనీ పన్ను తదుపరి నికర లాభం (PAT) ఏకంగా 197.32 శాతం పెరుగుదలతో రూ.9.62 కోట్లను తాకింది.

కంపెనీ నమోదు చేసిన ఈ త్రైమాసిక నికర లాభం వెనుక ఒక ఆసక్తికర...