Telangana, సెప్టెంబర్ 25 -- అంగన్వాడీ కేంద్రాలకు తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. ఈనెల 27 (సెప్టెంబర్ 27) నుంచి ఎనిమిది రోజులపాటు సెలవులు ఉండనున్నాయి. అంటే అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ కేంద్రాలు మూసివేసి ఉంటాయి.

అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల విజ్ఞప్తి మేరకు దసరా సెలవులు మంజూరు చేయాలని అధికారులకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాలను జారీ చేశారు. టేక్ హోమ్ రేషన్ విధానంలో లబ్ధిదారులకు పోషకాహారాన్ని అందజేయాలన్నారు.

గత కొద్దిరోజులుగా దసరా సెలవులపై అంగన్వాడీ సంఘ ప్రతినిధులు మంత్రి సీతక్కకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే దసరా, బతుకమ్మ పండగలు జరుపుకునే విధంగా దసరా సెలవులు మంజూరు చేయాలని ఐఎన్టీయూసీ అనుబంధ సంఘమైన తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్ బి అన్...