భారతదేశం, ఆగస్టు 14 -- నల్గొండ పోక్సో కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది.11 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం చేసి, ఆపై హత్య చేసిన నిందుతుడికి ఉరిశిక్ష విధించింది. ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది. అంతేకాకుండా లక్షా పది వేల రూపాయల జరిమామాను కూడా విధించింది.

2013 ఏప్రిల్ లో 11 ఏళ్ల బాలికపై ముకర్రం అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై హత్య కూడా చేశాడు. మృతదేహాన్ని నాలాలో పడేశాడు. మూడు రోజుల అనంతరం పోలీసులు బాలిక మృతదేహాన్ని దొరికింది. ఈ ఘటనపై నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో, హత్య కేసుల కింద కేసు నమోదు చేశారు.

ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు. 2015లో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయస్థానం. ఉరిశిక్షతో పాటు, రూ. 1.10 లక్షల జరిమానా కూడా విధించింది. ఈ తీర్పుపై బాలిక కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

ఈ ...