భారతదేశం, ఏప్రిల్ 10 -- బిజీగా సాగే నేటి జీవనశైలిలో సాయంత్రం వేళ వేడివేడి సమోసా, మిర్చి బజ్జీ, పకోడి లేదా రాత్రికి రుచికరమైన పరోటా తినడం చాలామందికి అలవాటు. నాలుకకు ఎంతో రుచినిచ్చే ఈ పదార్థాలు మన కడుపులోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తాయనేది ఎప్పుడైనా ఆలోచించారా? హోటళ్లలో దొరికే సాఫ్ట్ బ్రెడ్లు, బర్గర్లు, పిజ్జాలు.. ఇలా మనం ఇష్టంగా తినే ఫాస్ట్ ఫుడ్స్ అన్నింటిలోనూ ప్రధానంగా ఉండేది మైదా పిండి. చూడటానికి ఎంతో తెల్లగా, మృదువుగా ఉండే ఈ పిండిని తయారు చేసే ప్రక్రియలో వాడే రసాయనాలు మన శరీరంలోని అంతర్గత అవయవాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా ఈ పిండి తయారీ వెనుక ఉన్న పారిశ్రామిక కోణం గురించి తెలిస్తే, మనం రోజూ తీసుకునే ఆహారం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని అర్థమవుతుంది. ఈ తెల్లటి పిండి మన జీర్ణవ్యవస్థను ఎలా దెబ్బతీస్తుందో ఇప్పుడు వివరంగా తె...