భారతదేశం, మార్చి 13 -- శుక్రుడిని చాలా ముఖ్యమైన గ్రహంగా భావిస్తారు. సౌందర్యం, విలాసాలు, ప్రేమ, ఆనందం సంపద మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు స్థానం జాతకంలో బలంగా ఉంటే సుఖ సౌకర్యాలని ఎక్కువగా పొందవచ్చు. అలాగే శుక్రుడు అందం, నృత్యం, సంగీతం, ఫ్యాషన్ లాంటి సృజనాత్మక రంగాలకు కూడా కారకుడు. శుక్రుడు వ్యక్తిలో మాధుర్యం, ఆకర్షణ, ఇతరులను ఆకట్టుకునే లక్షణాలను కూడా అందిస్తాడు. దాంతో సమాజంలో వారు మంచి పేరు ప్రతిష్టలని పొందుతారు.

జ్యోతిష్యం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు రాశిచక్రాన్ని మారుస్తాయి మరియు దాని ప్రభావం ప్రజల జీవితాలపై కూడా కనిపిస్తుంది. మార్చి 26, 2026న, శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. విశేషమేమిటంటే, ఈ రోజున శ్రీరామనవమి పండుగను కూడా జరుపుకుంటారు.

అటువంటి పరిస్థితిలో, ఈ సంచారాన్ని జ్యోతిష్యశాస్త్రంలో ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. శ...