భారతదేశం, సెప్టెంబర్ 23 -- మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మెుక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అభివృద్ధిపై అధికారులతో మాట్లాడారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసగించారు. అభివృద్ధి అంటే అద్దాలు మేడలు, రంగుల గోడలే కాదని, ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

సమ్మక-సారక్క గద్దెల, ప్రాంగణ అభివృద్ధి పనులు జీవితంలో వచ్చిన అరుదైన అవకాశం అని రేవంత్ రెడ్డి చెప్పారు. జీవితంలో ప్రతి మనిషి జన్మిస్తాడు.. మరణిస్తాడు.. కానీ కొందరికే అరుదైన అవకాశాలు వస్తుంటాయన్నారు. మంత్రి సీతక్కతోపాటుగా తన జన్మ ధన్యమైందన్నారు. తనకు ఈ జన్మలో దక్కిన గొప్ప గౌరవం అని రేవంత్ రెడ్డి అన్నారు. సీతక్క అనుకున్నట్టుగానే అన్ని పనులు అవుతున్నాయన్నారు.

సమ్మక-సారక్క ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లు...