భారతదేశం, నవంబర్ 18 -- హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో గుర్తింపు పొందిన హైదరాబాద్ సంస్థ మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) యాజమాన్య మార్పులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పీవీ కృష్ణారెడ్డి తన మామ, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పామిరెడ్డి పిచ్చిరెడ్డి (పీపీ రెడ్డి) వాటాను కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి సుమారు రూ.7,000 కోట్లు సమీకరించినట్లు 'మనీకంట్రోల్' నివేదించింది.

న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే డేవిడ్‌సన్ కెంప్నర్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ ఎల్‌పీ ఈ నిధుల సమీకరణకు నేతృత్వం వహించింది. వార్డే పార్ట్‌నర్స్, హిల్‌హౌస్ క్యాపిటల్ సంస్థలు కూడా ఇందులో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు ఆ నివేదిక పేర్కొంది. కుటుంబ ఒప్పందంలో భాగంగా జరుగుతున్న ఈ ల...