Hyderabad, Oct. 26 -- మొంథా తుపాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఈ నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే తీర ప్రాంత జిల్లాలలో మోహరించాయి. తుపాన్‌పై ప్రెడిక్టివ్ మోడల్, రియల్ టైమ్ డేటా ఆధారంగా విశ్లేషణ చేస్తూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు.

‘మెుంథా తుపాను ప్రభావం రాష్ట్రంపై ఉంటుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం. మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారు...