Hyderabad, Oct. 26 -- ఆంధ్రప్రదేశ్‌లో మెుంథా తుపాను దూసుకొస్తోంది. ఇప్పటికే విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. అయితే అనేక తీరప్రాంత జిల్లాల్లో మెుంథా తుపాను ప్రభావం కారణంగా డిప్లొమాకు సంబంధించి సప్లీమెంటరీ పరీక్షలు వాయిదా వేశారు. సి-16, సి-20 స్కీమ్స్ కింద డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలను రాష్ట్ర సాంకేతిక విద్య మరియు శిక్షణ బోర్డు (SBTET) ఆంధ్రప్రదేశ్ వాయిదా వేసింది. అక్టోబర్ 27, 28 తేదీల్లో జరగాల్సిన పరీక్షలను సాంకేతిక విద్యా డైరెక్టర్ ఆదేశాల మేరకు వాయిదా వేసినట్లు అధికారిక పత్రికా ప్రకటనలో తెలిపింది. పరిస్థితిని సమీక్షించిన తర్వాత సవరించిన షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని బోర్డు తెలిపింది.

ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్స్ అందరూ తమ విద్యార్థులకు వాయిదా గురించి తెలియజేయాలని ఆదేశించారు. కొత్త పరీక్ష తేదీల అప్డేట్స్ కో...