భారతదేశం, అక్టోబర్ 15 -- హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఇంటిగ్రేటెడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ సంస్థ 'బొండాడ ఇంజనీరింగ్ లిమిటెడ్' (BSE: 543971) క్యాపిటల్ మార్కెట్లో మరొక అత్యంత కీలకమైన మైలురాయిని అధిగమించింది. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) ఎస్ఎమ్‌ఈ (SME) వేదిక నుంచి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) క్యాపిటల్ మార్కెట్ సెగ్మెంట్ (మెయిన్ బోర్డు)లోకి మారేందుకు ఎన్ఎస్ఈ నుంచి సూత్రప్రాయ అనుమతి లభించింది. ఈ మేరకు అక్టోబర్ 14, 2026 నాటి లేఖ ద్వారా ఎన్ఎస్ఈ తమ ఆమోదాన్ని తెలిపిందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

ఇప్పటికే 2026 సెప్టెంబర్ 9న బీఎస్ఈ మెయిన్ బోర్డు మైగ్రేషన్‌కు సంబంధించి బొండాడ ఇంజనీరింగ్‌కు సూత్రప్రాయ అనుమతి లభించింది. ఇప్పుడు ఎన్ఎస్ఈ నుంచి కూడా ఆమోదం లభించడంతో దేశంలోని రెండు ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీ...