భారతదేశం, జూన్ 29 -- Pregnant woman Suicide in Medak : మానవత్వాన్ని మంటగలిపే ఘోర సంఘటన వెలుగుచూసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన భర్తే, కడుపున పెరుగుతున్న బిడ్డ పుట్టుకను శంకించాడు. కన్నబిడ్డకు డీఎన్ఏ (DNA) పరీక్ష చేయించాలంటూ అత్తతో కలిసి తీవ్రమైన వేధింపులకు గురి చేశాడు. ఈ అవమానాలను తట్టుకోలేక ఓ 23 ఏళ్ల గర్భవతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయవిదారక ఘటన మెదక్ జిల్లాలోని అల్లాదుర్గ్ మండలంలోని గడిపెద్దపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా మోత్కుపల్లి గ్రామానికి చెందిన సుస్మిత (23) అనే యువతికి, మెదక్ జిల్లా గడిపెద్దపూర్ గ్రామానికి చెందిన గాజుల వ్యాపారి జి. అభిలాష్‌తో దాదాపు 18 నెలల క్రితం వివాహమైంది. ప్రస్తుతం సుస్మిత ఐదు నెలల గర్భవతి. అయితే... పెళ్లయిన కొద్దిరోజుల నుంచే సుస్మిత ప్రవర్తనపై...