భారతదేశం, మార్చి 29 -- ప్రజారోగ్య శాఖ(డైరెక్టర్ అఫ్ పబ్లిక్ హెల్త్-డీహెచ్) ద్వారా మెడికల్ ఆఫీసర్ల పోస్టుల భర్తీని తొలిసారిగా ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా నిర్వహించబోతున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఎంబీబీఎస్ అర్హతతో సివిల్ అసిస్టెంట్ సర్జన్(సీఏఎస్) పోస్టులకు ఎంపికైన వారికి అత్యంత పారదర్శక విధానంలో పోస్టింగ్ ఉత్తర్వులను ఆన్లైన్ ద్వారా కౌన్సెలింగ్ ద్వారా ఇవ్వబోతున్నామని చెప్పారు.

ఏపీ ఆన్లైన్ వారి సహకారంతో సోమవారం(మార్చి 30) నుంచి నిర్వహించబోతున్న కౌన్సెలింగ్ పోస్టింగ్ ఉత్తర్వుల జారీ 34 గంటల్లోగానే ముగుస్తుందని వెల్లడించారు. అభ్యర్థులు ఇచ్చిన ఆప్షనకు అనుగుణంగా 611 వైద్యుల నియామక పోస్టింగు ఉత్తర్వులను ఆటోమేటిగ్‌గా ఆన్‌లైన్ ద్వారానే ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ నిబంధనలు అనుసరించి(రిజర్వేషన్, ఇతర) అ...