భారతదేశం, జూన్ 12 -- కమెడియన్ ప్రణీత్ మోరే నిర్వహించిన ఓ స్టాండప్ కామెడీ షోలో ఓ మహిళా డాక్టర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వైద్య విద్యార్థుల ప్రాక్టికల్స్ కోసం ఉపయోగించే పురుషుల మృతదేహాల (Cadavers) ప్రైవేట్ భాగాలపై సదరు డాక్టర్ అసభ్యకరంగా జోకులు వేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ (AIMSA) శుక్రవారం తీవ్రస్థాయిలో మండిపడింది.

వైద్య విద్యార్థుల సంఘం ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు కీలక విజ్ఞప్తి చేసింది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఇలాంటి అభ్యంతరకరమైన జోకులను ప్రోత్సహించకుండా, ప్రసారం కాకుండా చూడాలని కోరింది.

"వైద్య విద్యకు దేహదాతలే మూలస్తంభం. వారికి అత్యున్నత గౌరవం, మర్యాద ఇవ్వాలి. మానవ అవశేషాలను అవహేళన చేయడం ఎంతమా...