భారతదేశం, మార్చి 31 -- డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టుపై మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడారు. మూసీ పునరుజ్జీవ పనులు పూర్తిగా ప్రజాస్వామ్య పద్ధతిలో, పారదర్శకంగా కొనసాగుతాయన్నారు.

ఈ ప్రాజెక్టులో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు మార్చి 31 నుండి ఏప్రిల్ 15 వరకు ఆన్‌లైన్ ద్వారా అభిప్రాయాల సేకరణ చేపడుతున్నామని భట్టి చెప్పారు. ప్రజలు తమ సూచనలను musirrdc@gmail.com మెయిల్ ఐడీకి పంపవచ్చన్నారు. ప్రజల నుండి వచ్చే ప్రతి విలువైన సూచనను అధికారులు విశ్లేషిస్తారని తెలిపారు.

'అవసరమైన పక్షంలో సూచనలు చేసిన వారితో సబ్ కమిటీ సభ్యులు నేరుగా భేటీ అవుతారు. నిర్మాణ డిజైన్లు, పునరావాసం, డిఫెన్స్ అంశాలు, బ్యాంకర్లతో చర్చల వంటి కీలక పనులను సమన్వయంతో వేగవంతం చేయాలి. ముఖ్య...