భారతదేశం, నవంబర్ 12 -- హైదరాబాద్ మహా నగరం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న చారిత్రాత్మక మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని రకాల కేంద్ర అనుమతులు పూర్తయ్యాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. శతాబ్దాల చరిత్ర కలిగిన మూసీ ప్రక్షాళనకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని.. త్వరలోనే గ్లోబల్ టెండర్ల ప్రక్రియను ప్రారంభించబోతున్నామని స్పష్టం చేశారు.

మొత్తం 55 కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉన్న మూసీ నది ప్రక్షాళనను రెండు విడతల్లో చేపట్టనున్నట్లు సీఎం వెల్లడించారు. తొలివిడత కింద రూపురేఖలు మార్చేందుకు 21 కిలోమీటర్ల మేర నదీ పరివాహక ప్రాంతంలో సమగ్ర అభివృద్ధి, పునరుజ్జీవన పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు.

హైటెక్ సిటీ లాంటి ఐటీ కారిడార్ మధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా, సౌందర్యవంతంగా పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి గురువ...