భారతదేశం, జూన్ 3 -- ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని సంకటహర చతుర్థిగా మనం పిలుస్తాము. అడ్డంకులను తొలగించే రోజుగా భావించే వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తాము. సంకటహర చతుర్థి నాడు వినాయకుడిని ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయి. సర్వాభీష్టాలు చేకూరుతాయి. ప్రతి నెలలో వచ్చే కృష్ణపక్షం నాలుగవ రోజు సంకటహర చతుర్థిని జరుపుకుంటాము. ఈరోజు వచ్చిన సంకటహర చతుర్థి మామూలుదే కాదు. ప్రతి మూడేళ్లకు ఒకసారి వచ్చే చతుర్థి. ఇది చాలా విశేషమైనదని చెప్పొచ్చు.

అధిక మాసంలో వచ్చే ఈ విభువన సంకష్ట చతుర్థి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. కాబట్టి ఈరోజును సరిగ్గా సద్వినియోగం చేసుకోవడం మంచిది. అలాగే ఈ ప్రత్యేకమైన రోజున ఉపవాసం ఉండి, చంద్రుని పూజించి, వినాయకుడిని ప్రత్యేకించి ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. చంద్రుని పూజతో ఉపవాసం పూర్తవుతుంది.

ఈ విభువన సంకష...