భారతదేశం, సెప్టెంబర్ 14 -- ఇటీవల షాకింగ్ ఘటనలో వెలుగులోకి వస్తున్నాయి. కన్నబిడ్డలను కడతేర్చే వార్తలు ఎక్కువ అవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలోని బండ్లగూడలో ఘోరమైన ఘటన జరిగింది. తన మూడేళ్ల కొడుకును చంపి మృతదేహాన్ని మూసీ నదిలో పడేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ దారుణమైన నేరానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్దాం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బండ్లగూడలో కూరగాయల వ్యాపారి మహమ్మద్ అక్బర్ (35) తన భార్య సనాబేగం, ఇద్దరు కుమారులతో ఉంటున్నాడు. అక్బర్ చిన్న కుమారుడు మహమ్మద్ అనాస్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో భార్యతో తరచూ గొడవలు అవుతున్నాయి. దీంతో కన్నబిడ్డను చంపాలని ప్లాన్ వేశాడు. శుక్రవారం రాత్రి భార్య పనికి వెళ్లిన తర్వాత ఇంట్లో ఉన్న బిడ్డను ఊపిరాడకుండా చేసి చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఒక సంచిలో పెట్టి.. తన బైక్‌పై తీసుకె...