భారతదేశం, ఫిబ్రవరి 7 -- సినిమా రంగంలో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రవీనా రవి తీవ్ర ఆందోళనలో ఉన్నారు. గత మూడేళ్లుగా ఇద్దరు వ్యక్తులు తనను, తన కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారంటూ ఆమె సోషల్ మీడియా వేదికగా ఆధారాలతో సహా బయటపెట్టారు. పోలీసులు ఫిర్యాదు చేసినా, హెచ్చరికలు జారీ చేసినా వారి వేధింపులు తగ్గకపోవడంతో రవీనా రవి బహిరంగంగా స్పందించాల్సి వచ్చింది.

తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వేధింపులకు సంబంధించిన స్క్రీన్ షాట్లను రవీనా రవి షేర్ చేశారు. శబరీష్ అనే వ్యక్తి, అతని కవల సోదరుడు (ట్విన్ బ్రదర్స్) కలిసి ఈ అరాచకానికి పాల్పడుతున్నట్లు రవీనా రవి గుర్తించారు. "ఇది పబ్లిక్ అవేర్‌నెస్ కోసం చేస్తున్న పోస్ట్.. ఎవరూ నిర్లక్ష్యం చేయకండి. నా కుటుంబాన్ని, స్నేహితులను రక్షించుకోవడానికే నేను ఈ విషయాన్ని బయటపెడుతున్నాను" అన...