Hyderabad, ఆగస్టు 13 -- ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా పట్టువదలని విక్రమార్కుడిలా నిరంతరం శ్రమిస్తూ ఇండస్ట్రీలోని టాలెంట్‌ను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు సంతోషం మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి. సంతోషం మ్యాగజైన్ పేరుతో 24 ఏళ్లుగా సురేష్ కొండేటి ఈ అవార్డులు ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే.
అదే విధంగా ఈ ఏడాది కూడా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఆగస్టు 16న హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరగనున్న ఈ అవార్డుల కార్యక్రమానికి అతిరథమహారథులను ఆహ్వానిస్తున్నారు సురేష్ కొండేటి.
మరో మూడు రోజుల్లో నిర్వహించినున్న ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటూ సినీ ప్రముఖులతో పాటు ఏపీ, తెలంగాణలోని ప్రభుత్వ పెద్దలను కూడా ఆహ్వానాలు అందిస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.