భారతదేశం, ఏప్రిల్ 5 -- ఆంధ్రప్రదేశ్‌లోని 108 అత్యవసర సేవా విభాగాలు క్లిష్టమైన కేసులకు వేగంగా స్పందించి ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. గత మూడు నెలల్లో 9,183 మంది గుండె జబ్బుల రోగులను 108 సర్వీసెస్ రక్షించింది. 108 అంబులెన్స్ నెట్‌వర్క్ అత్యవసర వైద్య సేవల కోసం వేగంగా పనిచేస్తోంది. శిక్షణ పొందిన సిబ్బంది, అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నిరంతర వైద్య పర్యవేక్షణతో కూడిన ఈ సేవ.. రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో ఆసుపత్రికి ముందు సంరక్షణను అందిస్తోంది.

గుండెపోటు వచ్చిన తర్వాత మొదటి గంటను 'గోల్డెన్ అవర్' అని పిలుస్తారు. ప్రాణరక్షణకు ఇది చాలా కీలకమని అధికారులు తెలిపారు. ఈ సమయంలో 108 అంబులెన్స్ బృందాలు రోగుల వద్దకు చేరుకుని, ఆసుపత్రులకు తరలించే మార్గమధ్యంలో ఆక్సిజన్ సపోర్ట్, సీపీఆర్, రక్తపోటును స్థిరీకరించడం, ప్రాథమిక ప్రాణరక్షణ వంటి తక్షణ చిక...