భారతదేశం, ఆగస్టు 19 -- రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలు రైతుల చెంతకు చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో హార్టికల్చరల్ రీసెర్చ్ కాంప్లెక్స్‌కు మంత్రి శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యాన రంగానికి కొత్త దిశను చూపే చారిత్రాత్మక ఘట్టంగా ఈ పరిశోధనా సముదాయం నిలుస్తుందని అన్నారు.

ఇప్పటివరకు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, ప్రయోగశాలల్లో ఎన్నో విలువైన పరిశోధనలు జరిగినప్పటికీ వాటి ఫలితాలు రైతులకు ఆశించిన స్థాయిలో చేరడం లేదని మంత్రి అన్నారు. గతంలో పరిశోధన ఫలితాలను రైతులకు చేరవేయడానికి రేడియో, టెలివిజన్ వంటి పర...