భారతదేశం, జనవరి 29 -- రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ షురూ అయింది. ప్రస్తుతం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈనెల 30వ తేదీతో నామినేషన్ల గడువు పూర్తవుతుంది. అయితే ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ఎన్నికల సంఘం ప్రత్యేకంగా రూపొందించిన TE-Poll మొబైల్ యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఎన్నికలకు సంబంధించి సమస్యలుంటే ఈ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేందుకు వీలుగా ప్రత్యేకంగా ఓ యాప్ ను తీసుకువచ్చినట్లు అధికారులు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. అంతేకాకుండా tsec.gov.in ద్వారా కూడా కంప్లైయిట్స్ ఇవ్వొచ్చని సూచించారు.

మరోవైపు ఫిబ్రవరి 3 వరకు నామినేషన్లు ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఫిబ్రవరి 11న పోలింగ్ నిర్వహిస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెల్లడించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 7 కార్పొరేషన్లు, 116 ...